Goreti Venkanna Biography in Telugu

 

Goreti Venkanna Biography in Telugu

గోరేటి వెంకన్న ప్రజకవిగా, ప్రజల మనిషిగా మాంచి పేరు పొందిన గొప్ప జానపద గాయకుడు మరియు రచయిత కూడా, ప్రజల పరిస్థితులను మరియు సమాజ అభివృద్ధిని ప్రభుత్వాల పనితీరును ద్రుష్టిలో పెట్టుకొని పాటలు పడటం మరియు రచనలు చేస్తారు. ఈయన తన చిన్ననాటి నుంచే పాటలపై మక్కువను పెంచుకున్నాడు.

వెంకన్న పాటలు పడే సమయంలో తనదైన శైలిలో డాన్స్ చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటాడు.
గల్లీ చిన్నది గరిబోల్ల కథా పెద్దది అని పాడిన పాటలో పేదవారి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు ఆ పాటలో పాడి చూపించారు.

జననం: goreti Venkanna Biography in telugu

గోరేటి వెంకన్న 1963, గౌరారం నాగర్ కర్నూల్ జిల్లాలో[Mahbubnagar] జన్మించారు.

తండ్రి నర్సింహ మరియు తల్లి ఈరమ్మ, అలాగే ఈయనకు ఎద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

గోరేటి వెంకన్న కు చిన్నతనం నుంచే పాటలు పడటం అంటే చాలా ఇష్టం.

కానీ సినిమా పాటలు మాత్రం అస్సలు ఇష్ట పడే వాడు కాదు, సినిమా పాటలతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండవని అనుకునేవాడు.

వెంకన్న తన పాఠశాల కార్యక్రమాల్లో ఎక్కువగా భక్తీ పాటలు పాడుతూ ఉండేవాడు.

వెంకన్న తండ్రి కూడా గొప్ప కళాకారుడు , ఈయన తల్లి కూడా ఇంట్లో పాటలు పాడుతూ ఉంటుంది.

ఇలా వెంకన్నకు పాటలు పడటంపై ఇష్టం కలిగింది. వెంకన్నకు పాటలు పడతంపై ఉన్న ఇష్టాన్ని గ్రహించిన వామపక్ష భావాలు కలిగిన వెంకటరెడ్డి అనే మాస్టారు కొన్ని పాటల పుస్తకాలు వెంకన్నకు ఇచ్చాడు.

మాస్టారు ఇచ్చిన పాటల పుస్తకాలు ఉన్న పాటలను వెంకన్న చాలా తేలికగా పడేవారు.

వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొని, రైతుల సమస్యలపై పాటలు రాయడం మరియు రాసిన పాటలను సభాలల్లో పాడుతూ ఉండేవాడు.

సినిమారంగ ప్రవేశం:

రాజ్యహింస పెరుగుతున్నదో పేదల నెత్తురు ఏరులై పారుతూన్నదో అని వెంకన్న పాడిన పాటను , ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ విన్నారు.

ఈ పాట పాడిన వ్యక్తి ఎవరు అని సుమారు రెండు నెలలు వెతికి వెంకన్న ను పట్టుకున్నాడు.

శంకర్ గారు వెంకన్నను సినిమా లో పాటలు పాడమని అడిగితే , నేను పడాను సినిమా వల్ల ప్రజలకు సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండవని విలక్షణంగా చూసాడు.

చివరకు తన మిత్రుడైన సహు అందించిన ట్యూన్ తో జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో అనే పాట పాడాడు ఈ పాట మంచి హిట్ అయ్యింది , అలాగే వెంకన్నకు కూడా మంచి పేరును తెచ్చిపెట్టింది ఎన్ శంకర్ గారు వెంకన్న యొక్క జీవితాన్ని ఇక్కడనుంచి సినిమా వైపూ మలుపు తిప్పాడు.

ఈయన ఇంకా ఎన్నో సినిమా పాటలు పాడటం మరియు రాయటం చేసేవారు. కుసుభం సినిమాలో వెంకన్న రాసిన మరియు పాడిన పాట పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అనే పాట వెంకన్నకు చాలా మంచి పేరును తెచ్చిపెట్టింది.
అంతే కాకుండా వెంకన్న గారు MAA TV లో ప్రసారమయ్యే రేల రే రేల అనే కార్యక్రమానికి న్యాయనిర్ణతగా సద్దుల అశోక్ గారితో కలిసి పనిచేశారు

పొందిన పురస్కారాలు:[ awards]

ఈయన పాటలతో పజల్లో కల్పించిన మార్పు, అప్పటి దోరాలపై , ప్రభుత్వాలపై కల్పించిన వ్యేతిరేక ధోరణికి తెలంగాణ ప్రభుత్యం వెంకన్నకు 2016- 90-09 తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకున్నారు.

New Telugu Movies 2022 September Month || New Telugu Movie Anchor Varshini Photos Viral | వైరల్ అవుతోన్న హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్..